Penugonda: సిద్ధాంతంలో ఓనం పండుగ సందడి.. పూల రంగవల్లుల శోభ!

Penugonda: పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఓనం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 25 Aug 2026 8:49 PM IST
Penugonda
X

Penugonda: సిద్ధాంతంలో ఓనం పండుగ సందడి.. పూల రంగవల్లుల శోభ!

పెనుగొండ: పెనుగొండ మండలం, సిద్ధాంతం గ్రామంలోని హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ఓనం పండుగ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని పాఠశాల ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా అలంకరించిన (పూలతో వేసే రంగవల్లి) వద్ద సందడి చేశారు.

కేరళ రాష్ట్రానికి చెందిన ఓనం పండుగ పంటల పండుగగా, సుఖసంతోషాలు, సమృద్ధి, ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు. మహాబలి చక్రవర్తి జ్ఞాపకార్థం జరుపుకునే ఈ పండుగలో ప్రజలు ఇళ్ల ముందు రంగురంగుల పూలతో రంగవల్లులు ఏర్పాటు చేసి, సాంప్రదాయ వంటకాలు తయారు చేసి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రజలందరూ సమానత్వం, సోదరభావంతో కలసిమెలసి ఉండాలనే సందేశాన్ని ఓనం పండుగ అందిస్తుంది.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఓనం విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ, భారతదేశంలోని భిన్న ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాల్సిన ఆవశ్యకతను వివరించారు. పాఠశాలలో నిర్వహించిన ఓనం వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఓనం పండుగ శాంతి, సంతోషం, సౌభాగ్యం, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story