Polavaram: పోలవరం ప్రభుత్వ పాఠశాలకు ఓఎన్జీసీ భారీ విరాళం!

Polavaram: ఏలూరు జిల్లా పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఓఎన్జీసీ (ONGC) సంస్థ రూ.6 లక్షల విలువైన బెంచీలు, కుర్చీలను విరాళంగా అందజేసింది.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 4 July 2026 4:11 PM IST
Polavaram
X

Polavaram: పోలవరం ప్రభుత్వ పాఠశాలకు ఓఎన్జీసీ భారీ విరాళం!

పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఓఎన్జిసి (ONGC) కంపెనీ వారు ప్రభుత్వ పాఠశాలకు వారి కంపెనీ నుండి పిల్లలకు క్లాస్ రూమ్ బెంచీలు, కుర్చీలను, సుమారు 6 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ ను స్థానిక ప్రభుత్వ పాఠశాల హై స్కూల్ కు విరాళంగా ఈరోజు ఐ టి డి ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ గంగు అనిల్ కుమార్ నేతృత్యంలో పాఠశాలకు ఓఎన్జిసి సంస్థ ప్రతినిధులు అందజేశారు.

ఈ సందర్భంగా ఐ టి డి ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ గంగు అనిల్ కుమార్ మాట్లాడుతూ పెద్ద మనసుతో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు మీరు చేసిన ఈ సహాయం పిల్లలు ఉపాధ్యాయులు మరియు పిల్లల తల్లిదండ్రుల కు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రభుత్వ స్కూళ్లలో అంతంత మాత్రంగా ఉన్న మౌలిక సదుపాయాలను మీలాంటి ఓఎన్జిసి సంస్థ గుర్తించి వారికి సదుపాయాలు కల్పించడం.

పై మీ ఓ ఎన్ జి సి సంస్థకు రుణపడి ఉంటామని ఇక్కడ చదువుతున్న తల్లిదండ్రుల గుండెల్లో స్థిరస్థాయిగా మీరు ఉంటారని మీ సంస్థ మరింత ఎదుగుదలకు ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పోలవరం మండల అధ్యక్షులు ఎంపీపీ సుంకర వెంకట్ రెడ్డి కి ఓఎన్జిసి ప్రతినిధులు ఉపాధ్యాయులు, మరియు ఐ టి డి ఎస్ డైరెక్టర్ గంగు అనిల్ కుమార్ చిరు సన్మానాన్ని చేశారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM

Next Story