Palakollu: ఎస్కేపీ అండ్ టీవీఆర్ పాఠశాలలో నేరాలు-శిక్షలపై అవగాహన
Palakollu: పాలకొల్లు ఎస్కేపీ అండ్ టీవీఆర్ పాఠశాలలో నేరాలు-శిక్షలపై పోలీసుల అవగాహనా సదస్సు. సీఐ రజనీ కుమార్, ఏఎస్‌ఐ రామకృష్ణ తదితరులు హాజరు.
Palakollu: ఎస్కేపీ అండ్ టీవీఆర్ పాఠశాలలో నేరాలు-శిక్షలపై అవగాహన
పాలకొల్లు: పాలకొల్లు పట్టణంలోని స్థానిక SKP and TVR మున్సిపల్ ఉన్నత పాఠశాలలో బాలికలు–మహిళలపై పట్ల జరిగే అఘాయిత్యాలు నేరాలు - శిక్షలు పట్ల పోలీస్ వారిచే అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ C.I రజనీ కుమార్ పాల్గొని మాట్లాడుతూ బాలికలకు సంబంధించిన విషయాలు, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, ఈవ్ టీజింగ్, POCSO చట్టం తదితర విషయాలపై అవగాహన కల్పించారు.
నేరారోపణ రుజువైతే పడే శిక్షలపై సవివరంగా అవగాహన కల్పించారు. అలాగే ASI రామకృష్ణ మాట్లాడుతూ చట్టం నుండీ ఎవ్వరు తప్పించుకోలేరని నేర ప్రవృత్తి లేకుండా విద్యార్థులందరు మంచి పౌరులుగా ఎదగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్, తదితర విషయాలపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ D. ఏసుబాబు, మహిళ పోలీసు నాగేశ్వరి, మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




