Palakollu: పాలకొల్లులో కామ్రేడ్ అడ్డాల సోమేశ్వరరావు 15వ వర్ధంతి సభ
Palakollu: పాలకొల్లులో కామ్రేడ్ అడ్డాల సోమేశ్వరరావు 15వ వర్ధంతి సభ. రైతులు, పేదల సమస్యలపై పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి అని సీపీఎం నేతల పిలుపు.
Palakollu: పాలకొల్లులో కామ్రేడ్ అడ్డాల సోమేశ్వరరావు 15వ వర్ధంతి సభ
పాలకొల్లు: రైతులు,పేదల సమస్యలపై పనిచేయటమే కామ్రేడ్ అడ్డాల సోమేశ్వరరావుకి అర్పించే నిజమైన నివాళులని సిపిఎం పార్టీ జిల్లాకమిటీ సభ్యులు ఏ.రవి అన్నారు. స్థానిక పార్టీఆఫీసులో కామ్రేడ్ అడ్డాల సోమేశ్వరరావు 15వ వర్ధంతి సభ జరిగింది. ముందుగా సోమేశ్వరావు చిత్రపటానికి సిపిఎం పార్టీ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ దిగుపాటి రాజగోపాల్ పూలమాలేసి నివాళులర్పించారు ఈసందర్భంగా జరిగిన సభకు పార్టీ మండల కన్వీనర్ బాతిరెడ్డి జార్జి అధ్యక్షత వహించారు.
ఈసందర్భంగా రవి మాట్లాడుతూ ఈరోజు ప్రజా సమస్యలపై చివరి వరకు పనిచేసే నాయకులు కరువైయారని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలలో ప్రతిపక్షపార్టీలను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటూన్నారు.
సర్ పేరుతో ఓటుహక్కుని కాలరాసి బతికున్నా చంపుతున్నారని విమర్శించారు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేస్తూ ఎన్నికైన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని ప్రశ్నించేవారి గొంతు నొక్కివిధంగా ఈనాటి రాజకీయాలున్నాయని కామ్రేడ్ సోమేశ్వరావు గారు రైతుల సమస్యల పైన గిట్టుబాటు ధర, సాగునీరు,కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర,వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు విత్తనాలు పురుగు మందులుతో బాటు రుణాలు వచ్చే విధంగాను, ఇతర పేదప్రజల సమస్య లపై అనేక పోరాటాలు చేసేవారిని ఆయన మండల,తాలూకా జిల్లా రైతు సంఘంలో నాయకుడిగా పనిచేశారని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఆయనకు నిజమైన నివాళులర్పించినట్లు అవుతుందన్నారు ఈకార్యక్రమంలో మండల నాయకులు చల్లా సోమేశ్వరరావు,బాసిన శ్యామల,తిరుమాని శీను, సత్యంశెట్టి శివ పురుషోత్తం, ఎర్ర అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




