Palakollu: ఇళ్లస్థలాలు, పక్కా ఇళ్ల సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర, సభ
Palakollu: పాలకొల్లులో ఇళ్లస్థలాలు, పక్కా ఇళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ముగిసింది, తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
Palakollu: ఇళ్లస్థలాలు, పక్కా ఇళ్ల సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర, సభ
పాలకొల్లు: ప్రజలకు కూడు,గుడ్డగూడు నిత్యవసరాలని గూడు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు ఏ.రవి అన్నారు బుధవారం,గురువారంలలో సిపిఎం పార్టీ ఇళ్లస్థలాలు,పట్టాలు,పక్కాఇళ్ళ సమస్యలపై నిర్వహించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన సభలో అన్నారు సభకు పార్టీ పాలకొల్లు మండలకన్వీనర్ భాతిరెడ్డి జార్జి అధ్యక్షత వహించారు ఈసందర్భంగా రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్నం వడ్డిస్తాము కూర్చోమని ఆకువేసి అన్నం పెట్టకుండా అన్యాయం చేస్తే ఈప్రభుత్వం పస్తులతో ఉంచేలా ఆకు మాప్రభుత్వానిది కాదంటూ ఇళ్లస్థలాల సమస్య పరిష్కరించడం లేదని రవి ఆరోపించారు.
పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాలలో 40 ఎకరాలు ఎలమంచిలి మండలం కొంతేరులో మరో 10 ఎకరాలు కొనుగోలు చేసి మండలంలో 2300 మందికి పట్టా కాగితాలు అందజేశారు అన్నారు కానీ ఆ భూములు పూడిక చేయనందున దారులు లేక వర్షంవస్తే మోకాళ్ళ లోతు నీళ్లలో మడుగులా మారిందన్నారు. దీంతో పట్టాలు పొందిన పేదలు ఇల్లు కట్టుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.
ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తే ఆన్లైన్ అయిపోయినందున వీరు మరొకచోట ఇళ్లస్థలం పొందే అర్హత కోల్పోయారని ఆరకంగా రెంటికి చెడ్డ రేవడిగా వీరి పరిస్థితి మారిపోయిందన్నారు 50 ఎకరాల ప్రభుత్వభూమి అందుబాటులో ఉన్నప్పుడు వాటిని చదును చేసి పేదలకు ఇల్లు నిర్మించుకునే సౌకర్యం కల్పించాల్సింది పోయి కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదని వాపోయారు లంకలకోడేరు రాజీవ్ నగర్ కాలనీలో 45ఏళ్లుగా జీవిస్తున్న పేదలు 40 కుటుంబాల వారికి పట్టాలు ఇవ్వనందున తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారన్నారు దగ్గులూరు యానాదులకు తాత్కాలిక రేకుల షెడ్లు వేశారని అవి పశువులు కూడా నివసించడానికి యోగ్యంగా లేవని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వాలు తక్షణం అర్హులైన పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చి పక్కాఇల్లు నిర్మించుకోవడానికి రుణాలు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ జిల్లాకమిటీ సభ్యులు పి.పూర్ణ,కారుమంచి క్రాంతిబాబులు కోరారు జిల్లాలో మంత్రి ఇలాకాలో ఇళ్లస్థలాల సమస్య పరిష్కరించకపోతే ఇక మిగిలిన చోట్ల ఎక్కడా పరిష్కారానికి నోచుకోదని వారన్నారు ప్రభుత్వ కాలనీల బకాయిలు నేటికి చెల్లించనందున ప్రజలు వేల రూపాయలు అప్పులు చేసి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు తక్షణం బిల్లుబకాయిలు విడుదల చేయాలని కోరారు.
అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ లో భాగంగా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండుసెంట్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించి ఇంతవరకు ఒక్కరికి కూడా సెంటు భూమీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు అర్హులైన వారందరికీ పెన్షన్ ఇస్తామని ఊరించి ఇప్పుడు రకరకాల కొర్రీలు పెట్టి ఇంతవరకు ఒక్కరికీ కూడా మంజూరు చేయలేదని భవిష్యత్తులో మంజూరు చేస్తామని చెప్తున్నా వివిధ కొర్రీలు పెట్టి దరఖాస్తులు చేసుకున్న వారిలో 10శాతంమందికి కూడా మంజూరు చేసే పరిస్థితి కానరావడం లేదన్నారు అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వకాలనీలో రోడ్లు మంచినీళ్లు వీధిలైట్లు తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు నిన్న శివదేవుని చిక్కాల లో ప్రారంభమైన పాదయాత్ర మండలంలో వివిధగ్రామాలు పర్యటించి రాత్రికి భగ్గేశ్వరం చేరుకుంది ఈరోజు ఉదయం పూలపల్లి మీదుగా పాలకొల్లు పట్టణంలో పలువార్డులు పర్యటించి తాసిల్దార్ కార్యాలయానికి చేరుకుంది పలుచోట్ల ప్రజలు తమ సమస్యల్ని సిపిఎం కార్యకర్తలకు తెలియజేశారు.
ధర్నా అనంతరం ఆఫీసు సూపర్నెంట్ కు ప్రజలు, సిపిఎం బృందం వినతిపత్రం అందించారు ఈకార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా,మండల నాయకులు ఏ.శ్యామలరాణి సత్యంశెట్టి పురుషోత్తం తిరుమాని శ్రీనివాస్ బాసిన శ్యామల బాతిరెడ్డి సుగుణ కొప్పర్తి నరసింహమూర్తి తెన్నేటి నాగరాజు సిర్ర విగ్నేశ్వరుడు గుబ్బల గంగాజలం గూడూరి నాగేశ్వరరావు చల్లా సోమేశ్వరరావు ఎర్ర అజయ్ కుమార్ తెన్నేటి శివాజీ శెట్టిమీ భాస్కరరావు గుబ్బల సత్యనారాయణ తదితరులు నాయకత్వం వహించారు ఈ ధర్నాలో వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పేదలు తమ పట్టా కాగితాలతో హాజరయ్యారు.




