Palakollu: లంకలకోడేరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ

Palakollu: లంకలకోడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారి ఏ.ఎస్.ఆర్. రెడ్డి. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అధికారి.

S VENKAT, PALAKOLLU
Published on: 18 Sept 2026 4:07 PM IST
Palakollu
X

Palakollu: లంకలకోడేరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ

పాలకొల్లు: పాలకొల్లు మండలలో లంకలకోడేరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ అధికారి ఏ.ఎస్.ఆర్. రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యత, రుచి, మెనూ అమలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు.

వంటశాలను, ఆహార పదార్థాల నిల్వ ప్రదేశాలను, వంట సామగ్రిని, పరిసరాలను పరిశీలించిన ఆయన వంటగది, భోజన ప్రదేశం, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రమైన వాతావరణంలో, నాణ్యమైన ఆహారాన్ని తయారు చేసి అందించాలని ఆదేశించారు.

ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేస్తూ విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన, సురక్షితమైన మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రతా ప్రమాణాలను పాటించాలని, వంటగదిలో ఎలాంటి అపరిశుభ్ర పరిస్థితులు లేకుండా చూడాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU