Palakollu: పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి కన్నుమూత
Palakollu: పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం.
Palakollu: పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి కన్నుమూత
పాలకొల్లు: పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) కన్నుమూత. అయనకు 85 సంవత్సరాల వయసు. పాలకొల్లులోని తన నివాసంలో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. డాక్టర్ బాబ్జి మృతితో పాలకొల్లు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అయన గతంలో 2004 నుంచి 2009 వరకు పాలకొల్లు నియోజకవర్గం టిడిపి శాసనసభ్యులుగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 2014 శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2019 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేసి మరలా ఓటమి చెందారు.
అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి జీవితం గడుపుతున్న సమయంలో అనారోగ్య సమస్యలు వల్ల ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేసారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు, పాలకొల్లు నియోజక వర్గ ప్రజలు అయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ సంతాపం తెలిపారు.




