Palakollu: ఎల్‌అండ్‌టీ కాలనీ టిడ్కో ఇళ్లలో గణనాథుని వేడుకలు

Palakollu: పాలకొల్లు ఎల్‌అండ్‌టీ కాలనీ టిడ్కో ఇళ్లలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, అన్నదానం. లడ్డూ వేలంపాటలో పాల్గొన్న ప్రముఖులు.

S VENKAT, PALAKOLLU
Published on: 21 Sept 2026 4:19 PM IST
Palakollu
X

Palakollu: ఎల్‌అండ్‌టీ కాలనీ టిడ్కో ఇళ్లలో గణనాథుని వేడుకలు

పాలకొల్లు: ఎల్‌అండ్‌టీ కాలనీ టిడ్కో హౌసెస్‌లో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారుఇర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కర్నేన గౌరు నాయుడు, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు రావూరి సుధ, పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

వినాయక చవితి సందర్భంగా కాలనీ వాసులు ఐకమత్యంతో వేడుకలను నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట ఉత్సాహంగా సాగింది. భక్తులు వేలంపాటలో ఆసక్తిగా పాల్గొనగా, చివరకు రావూరి సుధ రూ.12,500లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా కర్నేన గౌరు నాయుడు మాట్లాడుతూ, వినాయక చవితి వేడుకల్లో లడ్డూ వేలంపాట నిర్వహించడం ద్వారా భక్తులలో ఆధ్యాత్మిక భావనతో పాటు సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు. వినాయక చవితి పర్వదినం ప్రజలందరిలో భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ఐకమత్యం, సేవాభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

పండుగలను కేవలం ఉత్సవాలకే పరిమితం చేయకుండా అన్నదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం మంచి సంప్రదాయమని తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు, యువత, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

భక్తులందరికీ అన్నప్రసాదం అందించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిడగం రవి, ముద్దాల గణేష్ భవానీ, పసుపులేటి నందబాబు,యడ్ల జగన్నాథం,పడవల ఉమా శ్రీనివాస్,చేగొండి బాబీ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాలనీ వాసులు, భక్తులు మరియు నిర్వాహకులు కలిసి వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU