Palakollu: పాలకొల్లులో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం: మంత్రి నిమ్మల

Palakollu: పాలకొల్లులో హ్యామ్ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు.. విజయవాడలో టీచర్లపై వైఎస్సార్‌సీపీ మూకల దాడిని తీవ్రంగా ఖండించారు.

S VENKAT, PALAKOLLU
Published on: 22 Sept 2026 4:34 PM IST
Palakollu
X

Palakollu: పాలకొల్లులో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం: మంత్రి నిమ్మల

Palakollu: పాలకొల్లులో హమ్ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. విజయవాడ లో టీచర్లపై గొడ్డలి పార్టీ రౌడీ మూక దాడిని మంత్రి నిమ్మల రామానాయుడు ఖండించారు.

అయన మాట్లాడుతూ గొడ్డలి పార్టీ రప్పా రప్పా సంస్కృతిని మరో సారి బయటపెట్టిందనీ, గౌరవించాల్సిన టీచర్లపై గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ లతో దాడులు చేయించడం దారుణం అనీ, కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లను గొడ్డలి పార్టీ నాయకులు అవమానిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారనీ అయన మండి పడ్డారు.

రాష్ట్రంలో విధ్వంశం సృష్టించడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ పనిచేస్తోందనీ, రేపు అధికారంలోకి వస్తే నరకడం, చంపడం, దాడులు చేయడమే మా సంస్కృతి అని మరో సారి ప్రజలకు వార్నింగ్ ఇస్తోంది గొడ్డలి పార్టీ అనీ, ప్రకాశం జిల్లా, గుంటూరు, విజయవాడ పలు నగరాల నుండి రౌడీ మూకలను తీసుకొచ్చి విజయవాడలో టీచర్లపై గొడ్డలి పార్టీ దాడులు చేయించిందని, సైనికుడిగా దేశానికి సేవ చేసి అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన వ్యక్తి కూడా వైకాపా దుర్మార్గపు వైఖరి వల్ల ఇబ్బంది పడటం ఆవేదన కలిగిస్తుందనీ, క్రీడల్లో ప్రతిభ చాటి నిబంధనల ప్రకారం డీఎస్సీలో ఉపాధ్యాయునిగా పొందిన వారిని ఫేక్ అంటూ అవమానించడం సరికాదనీ, గ్రూప్ వన్ అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే, మెగా డీఎస్సీ పై జగన్ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నాడు అనీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU