Palakollu: డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల

Palakollu: పాలకొల్లులో జరిగిన డ్వాక్రా మహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. పండుగ కానుకగా చీరల పంపిణీ.

S VENKAT, PALAKOLLU
Published on: 18 Sept 2026 4:27 PM IST
Palakollu
X

Palakollu: డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల

పాలకొల్లు: పాలకొల్లులో జరిగిన డ్వాక్రా VOA,VOB ల ఆత్మీయ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు వినాయక చవితి, దసరా పండుగలను పురస్కరించుకుని చీరలను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. అయన మాట్లాడుతూ డ్వాక్రా అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే డ్వాక్రా అనీ ప్రస్థావించారు.

మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగేలా భారతదేశంలోనే తొలిసారిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటుచేసిన ఘనత చంద్రబాబు నాయుడుదనీ డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు సాధిస్తున్న విజయాలను ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారనీ ఆనాడు డ్వాక్రా సిఏ, ఆర్పి లకు తొలిసారిగా జీతాలు వ్యవస్థను టిడిపి ప్రభుత్వమే తీసుకువచ్చిందని అన్నారు.

గత ఐదేళ్ల పాలనలో పోలవరం, అమరావతి రాజధాని ధ్వంశమే కాదు, పాలకొల్లు లోను విధ్వంసం కనిపించిందనీ, నేడు కూటమి ప్రభుత్వంలో పెన్షన్లు సొమ్ము పెంపు, తల్లికి వందనం, అన్న క్యాంటీన్, ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం వంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి దిశగా పాలన నడుస్తుందనీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU