Palakollu: పాలకొల్లు అభివృద్ధికి రూ. 44 కోట్ల పుష్కర నిధులు మంజూరు
Palakollu: పాలకొల్లు అభివృద్ధికి రూ. 44 కోట్ల పుష్కర నిధులు మంజూరు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు.
Palakollu: పాలకొల్లు అభివృద్ధికి రూ. 44 కోట్ల పుష్కర నిధులు మంజూరు
పాలకొల్లు: పాలకొల్లు అభివృద్ధికి పుష్కర నిధులు రూ 44 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం లో గత ప్రభుత్వ పాలనలో విధ్వంసం జరిగిందని అభివృద్ధి అనేది నోచుకోలేదని ఇప్పుడు వడ్డీ తో సహా అభివృద్ధి చేస్తున్నాం.
అను ఈ పుస్కారాల నిధులతో మరింత అభివృద్ధి వైపు పాలకొల్లు నియోజకవర్గాన్ని తీసుకువెళ్తామని అయన అన్నారు. ఇంకా పాలకొల్లు పట్టణంలో కోట్లాది రూపాయలతో జరుగుతున్న వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో పాలకొల్లు మున్సిపల్ కార్యాలయ సమావేశ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.




