Palakollu: పేద బ్రాహ్మణుడికి కంటి వైద్యం కోసం రూ.17 వేల సాయం

Palakollu: పాలకొల్లులో పేద బ్రాహ్మణుడి కంటి వైద్యానికి వనిత క్లబ్ ఆధ్వర్యంలో రూ.17 వేల ఆర్థిక సహాయం అందించారు. గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు దాతగా నిలిచారు.

S VENKAT, PALAKOLLU
Published on: 5 Oct 2026 10:44 PM IST
Palakollu
X

Palakollu: పేద బ్రాహ్మణుడికి కంటి వైద్యం కోసం రూ.17 వేల సాయం

పాలకొల్లు: క్షీరా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సేవలందిస్తున్న పేద బ్రాహ్మణుడికి కంటి వైద్యం కోసం రూ.17 వేల ఆర్థిక సహాయం అందించారు. వనిత క్లబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో చేపడుతున్న హెల్త్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం దేవాలయ ప్రాంగణంలో ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కంటి వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సదరు బ్రాహ్మణుడు వనిత క్లబ్ సభ్యులను సహాయం కోరగా, క్లబ్ సభ్యులు స్పందించి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు గారి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన వైద్యానికి అవసరమైన మొత్తం రూ.17 వేల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు దాతగా ముందుకు వచ్చారు.

అవసరంలో ఉన్న వ్యక్తికి విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి వైద్య సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావుకు వనిత క్లబ్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు, వనిత క్లబ్ అధ్యక్షురాలు దేవరపు కాంచనమాల, కార్యదర్శి సిద్దిరెడ్డి శైలజారాణి, తోట గాయత్రి మరియు అసిస్టెంట్ గవర్నర్ జక్కంపూడి మదన్, రావూరి అప్పారావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU