Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
Palakollu: పాలకొల్లు కొత్త కుళాయి చెరువు వద్ద వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును సత్కరించారు.
Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
Palakollu: వాకర్స్ క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యం లో శుక్రవారం ఉదయం కొత్త కుళాయి చెరువు వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు మరియు సభ్యులు బాపూజీ చిత్రపటానికి పువ్వులు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కానుకొలను శ్రీనివాసరావు గాంధీ మహాత్ముని విశిష్ట వ్యక్తిత్వాన్ని, సత్యాగ్రహం,అహింసా విధానాల తో పోరాడి ప్రపంచానికి ఆదర్శం గా నిలిచిన తీరును వివరించారు. క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్ వాకర్స్ చే శాంతి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భం గా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును స్వీకరించిన రాయకుదురు ఉన్నత పాఠశాల ప్లస్ ప్రధానోపాధ్యాయులు కానుకొలను శ్రీనివాసరావు ను క్లబ్ తరపున సత్కరించారు.
కార్యక్రమం లో క్లబ్ ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, ధనాని శ్రీరామమూర్తి, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, నంబూరి గంగాపవన్, ధనాని సూర్య ప్రకాష్, దాసరి వెంకటేశ్వరరావు, కాపా చిరంజీవి, మేకా త్రిశూలపాణి, చామా శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు. స్వీట్స్ పంపిణీ తో వేడుక ముగించారు.




