Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఔదార్యం: పేద రోగులకు ఉచిత మందులు

Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు నిరుపేద రోగులకు శనివారం రూ.12 వేల విలువైన మందులను ఉచితంగా అందజేశారు.

S VENKAT, PALAKOLLU
Published on: 3 Oct 2026 9:13 PM IST
Palakollu
X

Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఔదార్యం: పేద రోగులకు ఉచిత మందులు

పాలకొల్లు: అనారోగ్యం తో బాధపడుతూ మందులు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్న ఇద్దరు పేద వ్యాధి గ్రస్తులు కోనసీమ జిల్లా లక్కవరం గ్రామానికి చెందిన బండారు లక్ష్మణ రావు, పాలకొల్లు మండలం పెదమామిడిపల్లి గ్రామానికి చెందిన కౌరు పెద్ది లక్ష్మి ల గురించి తెలిసిన వారు వాకర్స్ క్లబ్ పాలకొల్లు దృష్టికి తీసుకురావడంతో స్పందించిన క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు క్లబ్ తరపున వారికి 12 వేల విలువైన మందులను క్లబ్ సభ్యులతో కలిసి కొత్త కుళాయి చెరువు వద్ద శనివారం అందించారు.

కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షులు మానెం బసవరాజు, ధనాని కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, దాసరి వెంకటేశ్వరరావు, చామా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU