Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రమాదంలో గాయపడిన కార్మికుడు, అనారోగ్యంతో ఉన్న బాధితుడి కుటుంబానికి రూ.8 వేల విలువైన నిత్యావసర సరుకుల పంపిణీ.
Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
పాలకొల్లు: పాలకొల్లు పట్టణానికి చెందిన పేద కార్మికుడు చర్కాని సూర్యనారాయణ ఇటీవల మోటార్ సైకిల్ ప్రమాదానికి గురై ఇంటికే పరిమితం కావడం తో ఆ కుటుంబానికి అదే విధంగా వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న పట్టణం లోని రెల్లి వీధికి చెందిన ధనాల ప్రకాష్ కుటుంబానికి 8 వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను వాకర్స్ క్లబ్ పాలకొల్లు అధ్యక్షుడు సభ్యులతో కలిసి బుధవారం కొత్త కుళాయి చెరువు వద్ద అందించారు.
కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షులు మానెం బసవరాజు, ధనాని శ్రీరామమూర్తి, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, సోమంచి శ్రీనివాసశాస్త్రి, నేలపాటి రమేష్, గుగ్గిలపు ముత్యాల రావు తదితరులు పాల్గొన్నారు.




