Razole: అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
Razole: అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే, వైకాపా ఇంచార్జి పాముల రాజేశ్వరి దేవి అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Razole: అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు కాటన్ పార్క్ లోని మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రాజోలు వైకాపా ఇంచార్జి పాముల రాజేశ్వరి దేవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైకాపా శ్రేణులతో కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, త్యాగనిరతి, పోరాట పటిమ దేశ ప్రజలకు చిరస్మరణీయమని కొనియాడారు.
నేటి యువత అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




