Penugonda: గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి అంగన్వాడీల నిరసన

Penugonda: పెనుగొండలో అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 2 Oct 2026 10:20 PM IST
Penugonda
X

Penugonda: గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి అంగన్వాడీల నిరసన

పెనుగొండ: దేశవ్యాప్తంగా అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలని ఐసిడిఎస్ ప్రారంభించిన అక్టోబర్ 2న నిరసనల్లోభాగంగా పెనుగొండ గాంధీ బొమ్మ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ లీడర్ కే. తులసి మాట్లాడుతూ అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు రూ. 26 వేలు పెంచాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడిలను ఉద్యోగులుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని అన్నారు. ఈ రకమైన అన్యాయం చేస్తున్న ప్రభుత్వం అంగన్వాడీల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. అంగన్వాడీల కుటుంబ సభ్యులకు పెన్షన్, ఇతర పథకాలు ఏమీ కూడా అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఫ్రీ స్కూల్ పిల్లలకు మెనూ బియ్యం 100 గ్రాములు, కందిపప్పు 25 గ్రాములు, నూనె 10 గ్రాములకు పెంచాలని డిమాండ్ చేశారు.

గ్రాట్యూటీ చట్ట ప్రకారం సర్వీస్ లో చనిపోయిన వారికి, మధ్యలో మానుకున్న వారికి కూడా అమలు చేయాలని కోరారు. హెల్పర్ల ప్రమోషన్స్ గైడ్లైన్స్ ఇచ్చిన జీవో ఐదు ను సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ వెంకటేశ్వరరావు, షేక్ పాదుషా, గుడిమెట్ల వరహారెడ్డి, నీలాపు ఆదినారాయణ, పలువురు అంగనవాడి వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA