Penugonda: వడలిలో ఘనంగా మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ!
Penugonda: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలిలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.
Penugonda: వడలిలో ఘనంగా మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ!
పెనుగొండ: యావన్మంది భక్తులు ,ప్రజలు పర్యావరణ పరిరక్షణలో బాగంగా వినాయక చవితికి ప్లాస్టర్ అఫ్ పారీష్ తో తయారుచేసిన బొమ్మలను కాకుండా వినాయక మండపాలలో సహితం మట్టి ప్రతిమలతో చేసిన బొమ్మలను ఉపయోగించి పూజలు నిర్వహించాలని మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి చంటి అన్నారు .
పెనుగొండ మండలం వడలి గ్రామంలో సాయిబాబా వారి ఆలయము వద్ద వినాయక మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసిన కార్యక్రమంలో గుండపునీడి సత్యనారాయణతో కలసి పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు.
గుండపునీడి సత్యనారాయణ మాట్లాడుతూ అందరూ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రయత్నించాలని వినాయక మట్టి ప్రతిమలను పూజించిన అనంతరం చిన్నపాటి పూల కుండీలలో నిమజ్జనం చేసి మొక్కలను నాటాలని తెలిపారు. కార్యక్రమంలో పిప్పళ్ల సత్యనారాయణ , గుండపునీడి మనోజ్ లు పాల్గొన్నారు.




