Penugonda: పెనుగొండ పీఏసీఎస్ ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు
Penugonda: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నందు సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Penugonda: పెనుగొండ పీఏసీఎస్ ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు
Penugonda: ది పెనుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము నందు సహకార వారోత్సవాలు చివరి రోజు సందర్భంగా సొసైటీ నందు రైతులతో సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో పిఎసిఎస్ చైర్మన్ నక్కా వేద వ్యాస శాస్త్రి మాట్లాడుతు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ఆంధ్రప్రదేశ్ సభ హక్కుల కమిటీ చైర్మన్ శాసనసభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారు రైతుల పక్షపాతిగా కేంద్రం నుండి రాష్ట్రం నుండి ఎన్నో పథకాలను,
ప్రవేశపెట్టి రైతే రాజుని చేసిన ఘనత దక్కుతుందని తెలిపారు రైతుల సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యమని అన్నారు. సొసైటీ నందు రైతులకు అందుబాటులో ఉండే వివిధ రకాల రుణాల గురించి మరియు సొసైటీ వల్ల రైతులకు కలిగే లాభాలు గురించి వివరించారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీ వస్తుందని వివరించారు.
సొసైటీ నందు త్వరలోనే మాజీ మంత్రివర్యులు ఆచంట నియోజవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు పూజ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పితాని సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఎరువుల వినియోగం ప్రారంభం అవుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెంబర్లు వేండ్ర మురళి, కానూరు వెంకట సత్యనారాయణ, సీఈవో సూర్నీడి శ్రీరంగ సాయి పవన్ కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.




