Penugonda: 4వ రోజుకు చేరిన గ్రామ వీఆర్ఎల సహాయ నిరాకరణ ఉద్యమం!

Penugonda: పెనుగొండ, పోడూరు మండలాల్లో 4వ రోజుకు చేరిన వీఆర్ఎల సహాయ నిరాకరణ ఉద్యమం. సమస్యల పరిష్కారం కోరుతూ నల్ల బ్యాడ్జీలతో మండుటెండలో నిరసన దీక్ష చేపట్టిన వీఆర్ఏలు.

E.ABRAHAM, ACHANTA
Updated on: 19 Sept 2026 11:36 PM IST
Penugonda
X

Penugonda: 4వ రోజుకు చేరిన గ్రామ వీఆర్ఎల సహాయ నిరాకరణ ఉద్యమం!

పెనుగొండ: పోడూరు పెనుగొండ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెనుగొండ, పోడూరు మండల గ్రామ వీఆర్ఎలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 4.వ.రోజుకు చేరుకుంది. శనివారం మండల కేంద్రాలలో వీఆర్ఎలు నల్ల బ్యాడ్జీలు ధరించి దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎండలోనే నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. "

ఐక్యమే మన బలం.. పోరాటమే మన మార్గం" అంటూ నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. వీఆర్ ఏలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని వారు కోరారు. సమస్యలు

పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్నికొనసాగిస్తామని వీఆర్ఎలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ అధ్యక్షులు తానేటి నాగరాజు, పోడూరు అధ్యక్షులు, బి.ప్రకాశరావు, వీఆర్ఏలు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA