Penugonda: జూలై 24న విద్యాసంస్థల బంద్ పెనుగొండలో పోస్టర్ల ఆవిష్కరణ
Penugonda: నీట్ లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. జూలై 24న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని SFI, DYFI నాయకుల పిలుపు.
Penugonda: జూలై 24న విద్యాసంస్థల బంద్ పెనుగొండలో పోస్టర్ల ఆవిష్కరణ
పెనుగొండ: నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ 24వ తేదీ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎస్.ఎఫ్. ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.ఈశ్వర్, డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు ఎస్. వి. ఎన్ శర్మ లు ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జూలై 24 శుక్రవారం విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం పెనుగొండలోని స్థానిక ఎస్.వి.కే.పి కళాశాలల క్యాంపస్ వద్ద బంద్ పోస్టర్లను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ 2014 నుండి దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని నీట్ పేపర్ లీకేజ్ కారణంగా దేశవ్యాప్తంగా 22 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్ పేపర్ లీకేజ్‌కు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ, ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాలని గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పర్యావరణ వేత్త సోనం వాంగ్చుక్ నేటికీ ఆసుపత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
20వ తేదీ ఢిల్లీలో లక్షలాది మంది విద్యార్థులు శాంతియుతంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం కదం తొక్కారనీ తెలిపారు.విద్యార్థి, యువతపై అత్యంత అమానవీయంగా లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్‌ను ఉపయోగించి వేలాది మంది విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం,ఢిల్లీ పోలీసులు వ్యవహరించడం హేయమైన చర్య అనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక విద్యార్థిని ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నారనీ,వందలాది మంది విద్యార్థులు, నీట్ బాధిత విద్యార్థుల తల్లితండ్రులు పోలీసు లాఠీఛార్జ్ వల్ల తీవ్ర గాయాల పాలైనారని తెలిపారు.
విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, దేశ విద్యావ్యవస్థలో సమూల మార్పులు కావాలని, నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల వారీగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలని కోరుతూ, నీట్ తదితర పరీక్షా పత్రాల లీకేజీపై ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 24 వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పశ్చిమ గోదావరి జిల్లా లోని అన్ని ప్రజ్భుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లి,తండ్రులు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేసారు.కార్యక్రమంలో పెనుగొండ మండల నాయకులు కే.సాయి, కే.ప్రభాకర్,విజయ్, ఆర్.విజయ్,దేవేంద్ర, ఎస్. కె ఖలీఫ్, ఎస్.చింటూ, ఎన్.నాని తదితరులు పాల్గొన్నారు.




