Penugonda: పెనుగొండలో వర్షంలోనూ కొనసాగిన వీఆర్ఏల నిరసన
Penugonda: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 9వ రోజుకు చేరింది.
Penugonda: పెనుగొండలో వర్షంలోనూ కొనసాగిన వీఆర్ఏల నిరసన
పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని గాంధీ బొమ్మ సెంటర్లోని కచేరి వద్ద వీఆర్ఏలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం గురువారం 9వ రోజుకు చేరుకుంది. వర్షం కురుస్తున్నప్పటికీ వీఆర్ఏలు వెనక్కి తగ్గకుండా గొడుగులు పట్టుకుని నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. ఎన్నో రోజులుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మరింత కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఇకనైనా స్పందించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని వారు కోరారు. స్థానికులు ప్రజలు ప్రజాప్రతినిధులు వీఆర్ఏలకు సంఘీభావాన్ని ప్రకటించారు.




