Penugonda: ఉపాధి హామీలో కొత్త నిబంధనలు రద్దు చేయాలి.. పెనుగొండలో ధర్నా

Penugonda: పెనుగొండ సచివాలయం వద్ద ఉపాధి కూలీల నిరసన. వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే పనులు కల్పించాలని పూతినీడి పద్మ డిమాండ్.

E.ABRAHAM, ACHANTA
Published on: 1 July 2026 8:36 PM IST
Penugonda
X

Penugonda: ఉపాధి హామీలో కొత్త నిబంధనలు రద్దు చేయాలి.. పెనుగొండలో ధర్నా

పెనుగొండ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'వీబీజీ రాంజీ చట్టం'ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ పెనుగొండ గ్రామ సచివాలయం-4 వద్ద ఉపాధి హామీ కార్మికులు ఈరోజు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు పూతినీడి పద్మ మాట్లాడుతూ, "కొత్త చట్టం పేరుతో కార్మికులకు 125 రోజుల పని కల్పిస్తామని చెబుతూనే, అందులో 60 రోజులకు మించి పని ఇవ్వకుండా నిషేధం పెట్టడం దారుణం. అంటే 125 రోజుల పనికి హామీ ఇచ్చి 60 రోజులకే పరిమితం చేయడం మోసం.

పైగా వేతనాలు పెంచకుండా రోజుకు రెండు పూటలా పని చేయాలని ఒత్తిడి చేయడం కార్మికులను దోచుకోవడమే" అని మండిపడ్డారు.ఈ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా భూస్వాముల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందని ఆమె విమర్శించారు.

ఇది ఉపాధి హామీ చట్టం ప్రాథమిక లక్ష్యానికే విరుద్ధమని తెలిపారు.రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి పూనుకుంటే దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు పెద్దఎత్తున ఉద్యమిస్తారని, తాడోపేడో తేల్చుకుంటారని పద్మ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎస్. వెంకటేశ్వరరావు, పలువురు ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు. 'వీబీజీ రాంజీ చట్టం' రద్దు చేయాలి - " ఉపాధి కార్మికుల డిమాండ్"

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story