Penumantra: 108 వాహనంలో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి!
Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర 108 అంబులెన్స్‌లో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని డివిజన్ ఈవో పి. నాని తెలిపారు.
Penumantra: 108 వాహనంలో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి!
పెనుమంట్ర: అత్యవసర సేవలు అందించే 108 అత్యవసర వాహనంలో పాముకాటుకు సంబంధించిన ఇంజక్షన్ అందుబాటులో ఉంచినట్లు తాడేపల్లిగూడెం డివిజన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ పి. నాని తెలిపారు.
దీనికి సంబంధించి జిల్లా మేనేజర్ ఎం వి ఎస్ బి రామకృష్ణంరాజు ఆదేశానుసారం బుధవారం మండలంలోని 108 అత్యవసర వాహనాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా వ్యవసాయ పని నిమిత్తం రైతులు రాత్రి సమయంలో పొలాల దగ్గరికి వెళ్తుంటారని అందువల్ల పాము కాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
మండలంలో ఎవరైనా పాముకాటుకు గురైతే వెంటనే 108 అత్యవసర వాహనానికి సమాచారం అందిస్తే వెంటనే సకాలంలో సిబ్బంది అక్కడికి చేరుకుని పాముకాటుకి గురైన వ్యక్తికి అత్యవసర వాహనంలోనే క్షతగాత్రుని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ప్రాథమిక వైద్యం అందించి సకాలంలో దగ్గరలో ఉన్న హాస్పటల్ కు తరలించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలుగుతామన్నారు.
అనంతరం వాహనంలోని పరికిరాల పనితీరును, మందులను, రికార్డులను పరిశీలించి సంతృప్తి చెంది క్షతగాత్రులకు హాస్పటల్ కి వెళ్లే లోపు ప్రధమ చికిత్స అందించడంతో పాటు ఆత్మ స్థైర్యాన్ని కూడా కలగజేయాలని సిబ్బందికి సూచించారు.ఆయనతో పాటు 108 అత్యవసర వాహన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సిహెచ్ బాలకృష్ణ, పైలట్ కె జగదీష్ ఉన్నారు.




