Penumantra: పెనుమంట్ర వద్ద అదుపుతప్పి పడిన మోటార్ సైకిల్ వ్యక్తికి తీవ్ర గాయం!

Penumantra: పెనుమంట్ర మండలం పంపనవారిపాలెం వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడి తీవ్ర గాయాలపాలైన జామి విశ్వనాథం. 108 సిబ్బంది సహకారంతో తణుకు ఆసుపత్రికి తరలింపు.

E.ABRAHAM, ACHANTA
Published on: 1 Nov 2026 6:04 PM IST
Penumantra
X

Penumantra: పెనుమంట్ర వద్ద అదుపుతప్పి పడిన మోటార్ సైకిల్ వ్యక్తికి తీవ్ర గాయం!

Penumantra: పెనుమంట్ర మండలం మండలం పంపనవారి పాలెం గ్రామానికి చెందిన జామి విశ్వనాథం (34) పెనుమంట్ర వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా తన ఇంటికి కూత వేటు దూరంలో పెట్రోల్ బంకు వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తలకి తీవ్ర గాయం అయింది. వెంటనే స్థానికులు స్పందించి పెనుమంట్ర 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించగా సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బాలకృష్ణ పైలట్ బ్రహ్మాజీ సహకారంతో ఘటన స్థలంలోనే ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన చికిత్స కొరకు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA