Penumantra: కామ్రేడ్ ఎస్.ఆర్. దాట్ల సేవలు చిరస్మరణీయం సీపీఎం

Penumantra: పెనుమంట్రలో కామ్రేడ్ ఎస్.ఆర్. దాట్ల 47వ వర్ధంతి వేడుకలు. స్మారక స్తూపం వద్ద నివాళులర్పించిన సీపీఎం రాష్ట్ర నాయకులు బి. బలరాం, మంతెన సీతారాం.

E.ABRAHAM, ACHANTA
Published on: 31 July 2026 8:17 PM IST
Penumantra
X

Penumantra: కామ్రేడ్ ఎస్.ఆర్. దాట్ల సేవలు చిరస్మరణీయం సీపీఎం

పెనుమంట్ర: పెనుమంట్ర గ్రామంలో జన్మించి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని అనేక ఉద్యమాలకు ఊపిరి పోసిన అమరజీవి కామ్రేడ్ ఎస్ ఆర్ దాట్ల అందించిన సేవలు శాశ్వతం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి. బలరాం అన్నారు.

శుక్రవారం ఉదయం పెనుమంట్ర గ్రామంలోని ఎస్ఆర్ దాట్ల స్మారక స్తూపం వద్ద ఆయన 47వ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సార్ దాట్ల స్వాతంత్ర్య ఉద్యమంలోనూ, కల్లు గీత కార్మిక ఉద్యమంలోనూ కీలకపాత్ర వహిస్తూ అన్ని వర్గాల కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని అన్నారు.

అత్తిలి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి గెలుపొందిన ఎస్సార్ దాట్ల శాసనసభలో ప్రజా సమస్యలను ప్రస్తావించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని 1964లో సిపిఎం లో చేరిన ఆయన 1979 జూలై 31 న మరణించే వరకు పార్టీలోనే ఉన్నారని సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మంతెన సీతారాం అన్నారు.

కల్లుగీత కార్మికుల కోసం ఉద్యమాలకు నడుంబిగించిన దాట్ల గీత కార్మిక ఉద్యమ నిర్మాతగా చరిత్ర చెప్పారని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు.

స్థూపం వద్ద కార్యక్రమానికి ముందు బ్రాహ్మణ చెరువు సెంటర్ నుండి అనేకమంది సిపిఎం కార్యకర్తలు అభిమానులు ప్రజలు దాట్ల కుటుంబ సభ్యులు పాదయాత్ర, ప్రదర్శన చేస్తూ స్థూపం వద్దకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో వందలాదిమంది సిపిఎం నాయకులు కల్లుగీత కార్మికులు, శ్రామికులు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story