Penumantra: తుఫాను బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం డిమాండ్!

Penumantra: పెనుమంట్ర మండలంలో తుఫాను బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసిన CPM జిల్లా నాయకులు పి.వి. ప్రతాప్, జడ్పీటిసి అభ్యర్థి కేతా గోపాలన్.

E.ABRAHAM, ACHANTA
Published on: 1 Nov 2026 6:01 PM IST
Penumantra
X

Penumantra: తుఫాను బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం డిమాండ్!

Penumantra: పెనుమంట్ర తుఫాను బాధ్యత రైతులు, కవులు రైతులు, పేదలకు నష్టపరిహారం ఇవ్వడానికి దిక్కులు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అడగకుండానే కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రాయితీలు కల్పిస్తుందని సిపిఎం జిల్లా నాయకులు పి వి ప్రతాప్, జడ్పిటిసి అభ్యర్థి కేతా గోపాలన్ అన్నారు. పెనుమంట్ర మండలం జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పెనుమంట్ర, బ్రాహ్మణ చెరువు, బట్లమగుటూరు, ఆలమూరు, నెలమూరు, ఓడూరు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థిస్తూ మాట్లాడారు. తుఫాను వెళ్లి నాలుగు రోజులు కావస్తున్న అనేక గ్రామాలలో పేటలలో విద్యుత్తు సౌకర్యం మెరుగుపడలేదని, పల్లపు ప్రాంతాలు తేరుకోలేదని అన్నారు. ఈ కారణంగా ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టి పరిహారం అందించాలని వారు కోరారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అధికారాల పై చర్చ జరగాల్సి ఉందని అన్నారు.

స్థానిక సంస్థల ద్వారా త్రాగునీరు, రోడ్లు, విద్యుత్తు, గృహ నిర్మాణం, పంట రుణాలు, గిట్టుబాటు ధర, పెన్షన్లు వంటి అనేక సమస్యలు స్థానిక సంస్థల అధికారాలకు ముడిపడి ఉన్నాయని అన్నారు. అట్లాంటి స్థానిక సంస్థల్లో రైతులు, కౌలు రైతులు, ఇతర కష్టజీవులు తరఫున మాట్లాడేవారు అవసరం ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అన్నారు. సిపిఎం కు ఓటు వేయడమంటే ప్రజలు తమను తాము గెలిపించుకోవడమేనని అన్నారు. అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీలు ఓట్లు వేయించుకోవడం వాగ్దానాలు చేయడమే తప్ప ప్రజల కనీస అవసరాలు మెరుగుపరచడం లేదని అన్నారు.

కనీసం ఇచ్చిన వాగ్దానాలకు సమాధానం చెప్పే పరిస్థితిలో వారు లేరని అన్నారు. మళ్లీ రకరకాల వాగ్దానాలతో ప్రజల ముందుకు రావడం ప్రజలను ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. జన బలమే తప్ప ధన బలం లేని తమకు ఓట్లు వేయాలని స్థానిక సంస్థలలో మాట్లాడే అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పెనుమంట్ర ఎంపీటీసీ 2 అభ్యర్థి కోడి లక్ష్మి, సిపిఎం జిల్లా నాయకులు జక్కం శెట్టి సత్యనారాయణ, కోడి ప్రసాద్, ఎం ఆంజనేయులు, ఆకుల హరే రామ్, సుబ్బరాజు, బత్తుల విజయకుమార్, పిల్లి రాజారావు, నేతల నాగేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA