Penumantra: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం పితాని
Penumantra: పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు, సత్యవరంలో పర్యటించిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాల కరపత్రాల పంపిణీ.
Penumantra: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం పితాని
పెనుమంట్ర: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు-సత్యవరం గ్రామాల్లో‘అభివృద్ధి– సంక్షేమానికి రెండేళ్ల నమ్మకం.. కూటమి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు. కరపత్రాలను పంపిణీచేశారు.
కొయ్యేటి పాడులో ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.3 కోట్లతో సీసీ రోడ్డు త్వరలో నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సత్యవరంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి రూ.12 లక్షలతో ఏర్పాటు చేసిన కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అర్హులైన కుటుంబాలకు ఇంటి స్థలాలు, సీసీ రోడ్లు, రైతులకు అవసరమైన రహదారుల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




