Penumantra: మార్టేరులో పల్స్ పోలియో డ్రైవ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పితాని
Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు పీహెచ్‌సీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంభించారు.
Penumantra: మార్టేరులో పల్స్ పోలియో డ్రైవ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పితాని
పెనుమంట్ర: మండలంలోని మార్టేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలియో వంటి శాశ్వత వైకల్యానికి కారణమయ్యే వ్యాధి నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు.
దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు.ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల సామాజిక బాధ్యత అని అన్నారు.ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రతి కుటుంబం కార్యక్రమానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
పిల్లల ఆరోగ్యమే సమాజం ఆరోగ్యానికి పునాది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల విజయానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో కుట మినాయకులు, వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




