Penumantra: మార్టేరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Penumantra: పెనుమంట్ర మండలం మార్టేరులో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు. బైక్ ర్యాలీలో పాల్గొని జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ.

E.ABRAHAM, ACHANTA
Published on: 15 Aug 2026 8:57 PM IST
Penumantra
X

Penumantra: మార్టేరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పెనుమంట్ర: పెనుమంట్ర మండలం మార్టేరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలమూరు నుంచి మార్టేరు వరకు మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కూటమి నాయకులతో కలిసి బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. మార్టేరు సెంటర్‌లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సాంకేతిక, ఆర్థిక రంగాల్లో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ అగ్రస్థానానికి చేరేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, అభివృద్ధి పథంలో భారత్‌ను ముందుకు నడిపించేందుకు యువతతో పాటు ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story