Penumantra: వాస్తవ కౌలురైతుల పేరునే ఈ-క్రాప్ నమోదు చేయాలి బలరాం

Penumantra: పెనుమంట్రలో కౌలురైతుల సంఘం జిల్లా సమావేశం. పంటలు పండించే కౌలురైతుల పేరునే ఈ-క్రాప్ నమోదు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరాం విమర్శనాత్మక డిమాండ్.

E.ABRAHAM, ACHANTA
Published on: 31 July 2026 8:22 PM IST
Penumantra
X

Penumantra: వాస్తవ కౌలురైతుల పేరునే ఈ-క్రాప్ నమోదు చేయాలి బలరాం

పెనుమంట్ర: పంటలభీమా కట్టండని అధికారులు ప్రచారం చేస్తున్నా వాస్తవంగా పంటలు పండించే కౌలురైతులకు ఒరిగేదేమి లేదని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.బలరాం విణర్మించారు. ఏపి కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ సమావేశం పెనుమంట్ర లోని ప్రజాసంఘాల కార్యాలయంలో బి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.

ఈసమావేశానికి హాజరైయిన ఏపి కోలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.బలరాం మాట్లాడుతూ రాష్ట్రలో ఏప్రభుత్వం వచ్చిన కౌలురైతులను పట్టించు కోవడం లదన్నారు. కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలంటే భూయజమానితో లింక్ పెట్టిన ప్రభుత్వం వాస్తవంగా పంట పండించే కౌలురైచుల పేరునా కనీసం పంటనమోదు కూడా చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంటనమోదు కౌలురైతుల పేరునే చేయాలని నిబంధనలు వున్న అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వక పంటనమోదు చేయకుండా పంటలభీమా, పంటనష్టం వంటి రాయితీలు ఎలా ఇస్తారని విమర్శించారు.

తక్షణమే కౌలురైతుల పేరున పంటనమోదు చేసి ప్రభుత్వ రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడగా కమిటీ సభ్యులు కె.గోపాలన్, ఆకుల సత్యనారాయణ, కర్రి నాగిరెడ్డి, కేతా పూర్ణారావు, బి.నలమహారాజు,టి.రాము,జి. భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story