Penumantra: వనంపల్లిలో 'మన ఊరు-మన బాధ్యత' భారీ బహిరంగ సభ

Penumantra: పెనుమంట్ర మండలం వనంపల్లిలో రుద్రభూమి అభివృద్ధి కోసం గ్రామస్తుల ఐక్యత. కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని 'మన ఊరు-మన బాధ్యత' సభలో ఏకగ్రీవ తీర్మానం.

E.ABRAHAM, ACHANTA
Updated on: 19 July 2026 8:13 PM IST
Penumantra
X

Penumantra: వనంపల్లిలో 'మన ఊరు-మన బాధ్యత' భారీ బహిరంగ సభ

పెనుమంట్ర: నెగ్గిపూడి గ్రామపంచాయతీ పరిధిలోని వనంపల్లి గ్రామ యువత ఆధ్వర్యంలో "మన ఊరు - మన బాధ్యత" అనే నినాదంతో గ్రామంలోని రుద్రభూమి అభివృద్ధి కోసం ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సమావేశానికి గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి వందలాది మంది గ్రామస్తులు హాజరై రుద్రభూమిని కుల, మత భేదాలకు అతీతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఏకగ్రీవంగా వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ కులాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

రుద్రభూమి అభివృద్ధి గ్రామానికి అవసరమైన సామాజిక బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేస్తామని సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామాభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పలువురు పిలుపునిచ్చారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story