Penumantra: పెనుమంట్రలో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం

Penumantra: పెనుమంట్ర మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సహాయ నిరాకరణ ఉద్యమం 27వ రోజుకు చేరుకుంది. పే స్కేలు, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్.

E.ABRAHAM, ACHANTA
Published on: 12 Oct 2026 8:35 PM IST
Penumantra
X

Penumantra: పెనుమంట్రలో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం

పెనుమంట్ర: గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేలు అమలు చేయాలని, అర్హత కలిగిన గ్రామ రెవెన్యూ సహాయకులకు గ్రామ రెవెన్యూ అధికారులుగా పదోన్నతులు కల్పించాలని, నామినీ గ్రామ రెవెన్యూ సహాయకులను క్రమబద్ధీకరించాలని కోరుతూ పెనుమంట్ర మండల గ్రామ రెవెన్యూ సహాయకులు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం సోమవారానికి 27వ రోజుకు చేరింది.

మండలంలోని 18 గ్రామాలకు చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు ఉద్యమంలో పాల్గొంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అర్హత, అనుభవం ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులకు గ్రామ రెవెన్యూ అధికారులుగా పదోన్నతులు కల్పించాలని, తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA