Achanta: మండల పరిషత్ కార్యాలయంలో ఓటర్ల జాబితా పరిశీలనకు అవకాశం!
Achanta: ఆచంట మండల ప్రజా పరిషత్ పరిధిలోని 17 ఎంపీటీసీ స్థానాల ఫోటో ఓటర్ల జాబితా విడుదల. ఎంపీపీ కార్యాలయంలో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు అధికారుల వెల్లడి.
Achanta: మండల పరిషత్ కార్యాలయంలో ఓటర్ల జాబితా పరిశీలనకు అవకాశం!
ఆచంట: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము, 1994 నందలి పరిచ్చేధములు 11, 12 మరియు 151 నందలి 2వ నియమము ననుసరించి, ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్(ఓటర్ల జాబితా తయారి & ప్రచురణ) నియమములు, 2000 నందలి 7(2)వ నియమమును అనుసరించి, మరియు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గము ( ఎంపీటీసీ) 2వ సాధారణ ఎన్నికల నిర్వహణ నిమిత్తము, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్, విజయవాడ వారి నోటిఫికేషన్ నెం. 515/SEC-B1/2026,
తేది 07-09-2026 ని అనుసరించి; జిల్లా, ఆచంట మండల ప్రజా పరిషత్ నందలి 17 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానములకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను ది11-09-2026న ప్రచురించి, మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు ప్రజల పరిశీలనార్ధము అందుబాటులో ఉంచడమైనది.




