Poduru:పోడూరు మండలం తూర్పుపాలెంలో దోమలపై ఆరోగ్య శాఖ స్పెషల్ ఆపరేషన్!

Poduru: మురసు తుఫాన్ ప్రభావం అనంతరం దోమల నివారణకు పోడూరు మండలం తూర్పుపాలెం గ్రామంలో ఆరోగ్య శాఖ స్పెషల్ ఆపరేషన్ చేపట్టి ఏఎల్ఓ, ఎబేట్ మందు పిచికారితో పాటు ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహించింది.

E.ABRAHAM, ACHANTA
Published on: 12 Nov 2026 9:49 PM IST
Poduru
X

Poduru:పోడూరు మండలం తూర్పుపాలెంలో దోమలపై ఆరోగ్య శాఖ స్పెషల్ ఆపరేషన్!

పోడూరు: ఆర్నబ్ మురసు తుఫాన్ ప్రభావంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న గ్రామాలు గ్రామాల్లో దోమల బెడద... ఆరోగ్య శాఖ స్పెషల్ ఆపరేషన్. పోడూరు మండలంతూర్పుపాలెం గ్రామంలో గురువారం దోమలపై యుద్ధం మొదలైంది. తుఫాన్ తర్వాత పేరుకుపోయిన నీరు, పెరిగిన దోమల నుంచి ప్రజలను కాపాడేందుకు ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది.హెల్త్ అసిస్టెంట్ డి.రామకృష్ణనేతృత్వంలో... గ్రామం మొత్తం జల్లెడ.

మెయిన్ ఏరియానాయి బ్రాహ్మణ ఏరియా ఆనందరావు పేట ఏరియా గ్రామంలో అన్ని ప్రాంతాలు వదలకుండా ఏ ఎల్ ఓ ఎం టి లార్వా స్ప్రేయింగ్, ఏబేట్ మందు స్ప్రే చేశారు. 20 లీటర్ల నీటికి 10 ఎంఎల్ చొప్పున పక్కా కొలతతో మందు పిచికారి చేశారు. ఇంటింటికీ ఫీవర్ సర్వే డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంట్లో ఫీవర్ సర్వే చేశారు. ఎవరికైనా జ్వరం ఉందా లేక దోమల వలన ఇబ్బంది ఉందా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ - డి. రామకృష్ణ,ఏఎన్ఎం రాజకుమారిఆశాలు కమల, కె. ఎస్తేరు రాణి,సూపర్వైజింగ్, సి హెచ్ ఓ శంకర్ పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA