Poduru: పోడూరు ఎంపీటీసీ-1కి దివ్యాంగుడు లక్ష్మణ కుమార్ నామినేషన్!
Poduru: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు ఎంపీటీసీ-1 స్థానానికి దివ్యాంగుల సేవా సంఘం తరఫున గుత్తుల లక్ష్మణ కుమార్ నామినేషన్ వేశారు.
Poduru: పోడూరు ఎంపీటీసీ-1కి దివ్యాంగుడు లక్ష్మణ కుమార్ నామినేషన్!
పోడూరు: దివ్యాంగులు సమాజంలో అన్ని రంగాల్లో సమాన అవకాశాలు పొందాల్సిన అవసరం ఉంది. విద్య, ఉపాధితో పాటు రాజకీయ రంగంలోనూ వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో పోడూరు దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో సంఘం తరఫున పోడూరు ఎంపీటీసీ-1 స్థానం నుంచి గుత్తుల లక్ష్మణ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
రాజకీయాల్లోనూ సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి
దివ్యాంగులకు విద్య, ఉపాధితో పాటు రాజకీయ రంగంలోనూ నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని పోడూరు దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం డిమాండ్ చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దివ్యాంగులకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరింది. దివ్యాంగుల హక్కులను పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మల్లుల సూర్యనారాయణ, కోశాధికారి బి. కుమారి, బి. శిరీష, జి. కళ్యాణి, గుబ్బల ప్రసాద్‌బాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.




