Poduru: కుమ్మరి గుంట అంగన్‌వాడీ కేంద్రంలో 'పోషణ్ మాహ్' కార్యక్రమం!
Poduru: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కుమ్మరి గుంట అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ మాహ్ కార్యక్రమం నిర్వహించారు.
Poduru: కుమ్మరి గుంట అంగన్‌వాడీ కేంద్రంలో 'పోషణ్ మాహ్' కార్యక్రమం!
పోడూరు: పోషణ్,మహాకార్యక్రమంలో భాగంగా బుధవారం పోడూరు మండలం కుమ్మరి గుంట అంగన్వాడి కేంద్రంలో, సూపర్వైజర్ ఎం.డి హసీనా ఆధ్వర్యంలో సిడిపిఓ ఉమా ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో హసీనా మాట్లాడుతూ గర్భవతులు పోషక ఆహారం నేచురల్ ఫుడ్ ఆకుకూరలు కూరగాయలు పోలిక్ యాసిడ్ ఐరన్ కోసం పాలకూర తోటకూర క్యారెట్లు ఎక్కువగా తీసుకోవాలని ప్రోటీన్లు బేబీ ఎదుగుదలకు కోడిగుడ్లు పాలు పెరుగు పప్పు ధాన్యాలు ముడి ధాన్యాలు సహాయపడతాయని తాజా పండ్లు ఖర్జూరం నారింజ మరియు సీజనల్ పండ్లు మేలు చేస్తాయని నీరు రోజుకి కనీసం మూడు నాలుగు లీటర్ల నీళ్లు త్రాగి శరీరాన్ని హైట్రేట్ గా ఉంచుకోవాలని, తినకూడనివి నివారించవలసినవి.
కాఫీ టీ భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల ఒంట్లోకి ఐరన్ సరిగ్గా అబ్జర్వ్ అవదని పచ్చి ఆహారాలు సరిగ్గా ఉడకనివి మాంసం పచ్చి గుడ్లు లేదా హాఫ్ బాయిల్డ్ తినకూడదు పొగాకు మద్యం ఇవి బిడ్డ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని, బరువైన వస్తువులను ఎత్తడం కఠినమైన పనులు చేయడం పూర్తిగా తగ్గించాలని ముఖ్యంగా నెలలు నిండుతున్నప్పుడు తేలికపాటి వాకింగ్ చేయడం ప్రస్తుతానికి మంచిదని రోజుకు కనీసం ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరమని ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందని.
డాక్టర్ సలహాలు లేకుండా ఎటువంటి సొంత వైద్యం చేయకూడదని ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వాడాలని తెలిపారు. కార్యక్రమానికి కుమ్మరి గుంట యు.పి స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ పాల్గొన్నారు.




