Penumantra: చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారమే కీలకం: ఐసీడీఎస్ సూపర్ వైజర్!
Penumantra: చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని పెనుమంట్ర మండలం వనంపల్లిలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ సూర్యకుమారి వెల్లడి. పోషణ్ మాసం అవగాహన సదస్సు నిర్వహణ.
Penumantra: చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారమే కీలకం: ఐసీడీఎస్ సూపర్ వైజర్!
పెనుమంట్ర: చిన్నారుల ఆరోగ్యకర ఎదుగుదలకు పోషకాహారం ఎంతో కీలకమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సూర్యకుమారి అన్నారు. పోషణ్ మాసంలో భాగంగా నెగ్గిపూడి పంచాయతీ పరిధిలోని వనంపల్లి అంగన్‌వాడీ కేంద్రం–230లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తల్లిపాల ప్రాధాన్యత, సమతుల ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లను పిల్లలకు అందించాలని సూచించారు.
పిల్లల బరువు, ఎత్తు, ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




