Eluru: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై గ్రౌండ్ లెవెల్ పరిశీలన
Eluru: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఏలూరు జిల్లా అధికారులు దృష్టి సారించారు.
Eluru: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై గ్రౌండ్ లెవెల్ పరిశీలన
Eluru: ఏలూరు జిల్లా కలెక్టర్ మరియు ఏలూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు, జంగారెడ్డిగూడెం సబ్-డివిజన్ పోలీసు అధికారి శ్రీమతి సుస్మిత రామనాథన్, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి పోలవరం ప్రాంతంలో విస్తృత స్థాయి గ్రౌండ్ లెవెల్ పరిశీలన నిర్వహించబడింది.
ఈ పరిశీలనలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో గారు, ఆర్ & బి అధికారులు, ఇతర శాఖల అధికారులు, పోలవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారు, జీలుగుమిల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారు, కొయ్యలగూడెం ఎస్‌ఐ గారు, పోలవరం ఎస్‌ఐ గారు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రానున్న 2027 గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సురక్షితంగా పుష్కర స్నానాలు ఆచరించి తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా చేపట్టవలసిన చర్యలపై అధికారులు సమగ్రంగా చర్చించారు.
పరిశీలనలో భాగంగా పుష్కర ఘాట్లు, ఘాట్లకు అనుసంధానమైన రహదారులు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీటి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, అత్యవసర సేవలు, జనసమ్మర్ద నియంత్రణ చర్యలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు.




