Palakollu: తహసిల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా: దళితులకు స్మశానాలు కేటాయించాలని డిమాండ్!

Palakollu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ ఆధ్వర్యంలో ధర్నా.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Aug 2026 9:27 PM IST
Palakollu
X

Palakollu: తహసిల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా: దళితులకు స్మశానాలు కేటాయించాలని డిమాండ్!

పాలకొల్లు: స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా నేటికీ దళితులకు స్మశానాలు లేక అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాతిరెడ్డి జార్జి అన్నారు. పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయం వద్ద సామాజిక శంఖారావం సర్వేలో వచ్చిన సమస్యలపై ధర్నా చేసి *తహసిల్దార్ దుర్గా కిషోర్* కు వినతిపత్రం సమర్పించారు. వారు మరో జిల్లా నాయకులు ఏ.రవి తో మాట్లాడారు.

రూరల్ మండలం దగ్గులూరులో యానాదులకు వేసిన రేకు షెడ్లు అధ్వానంగా ఉన్నాయని అరటికట్ల లో దళితులతో పాటు ఇతర కులస్తులకు కూడా స్మశానాలు లేవని కూటమి ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లవుతున్న నేటికీ ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకొల్లు పట్నం 31 వ వార్డు వడలివాని పేటకు సంబంధించిన దళితుల స్మశానం ఆక్రమణకు గురైయిందని సర్వే చేసి చుట్టూ ప్రహరీ నిర్మించాలని స్మశానంలో షెడ్డు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.

దీనిపై తహసిల్దార్ స్పందిస్తూ దగ్గులూరు యానాదుల పేట వడలవానిపేట స్మశానం సందర్శిస్తానని తన పరిధిలో చేయగలిగే పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. అరట్లకట్ట దళితులకు ఇతర కులాల వారికి కూడా త్వరలోనే 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి స్మశానంగా ఏర్పాటుకు ప్రతిపాదనలు పై అధికారులకు పంపుతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం లో *చల్లా సోమేశ్వరరావు, తిరుమాని శీను యర్రా అజయ్ మహిళా సంఘం నాయకురాలు బి సుగుణ ఏకల రాము, మల్లుల గణపతి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story