Bhimavaram: భీమవరంలో ఘనంగా 'వందేమాతరం' 150 ఏళ్ల వేడుకలు రఘురామకృష్ణంరాజు!
Bhimavaram: SRKR ఇంజనీరింగ్ కాలేజీలో వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు. ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.
Bhimavaram: భీమవరంలో ఘనంగా 'వందేమాతరం' 150 ఏళ్ల వేడుకలు రఘురామకృష్ణంరాజు!
Bhimavaram: వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో SRKR ఇంజనీరింగ్ కాలేజీ, అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు వందేమాతరం గీతాలాపన, భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరై, ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ
వందేమాతరం గీతంలోని మొత్తం ఆరు చరణాలను నేర్చుకోవడం జరుగుతోందని, గతంలో కేవలం రెండు చరణాలు మాత్రమే ప్రాచుర్యంలో ఉండేవి అన్నారు. వందేమాతరం గీతంలోని మొత్తం ఆరు చరణాలను జాతీయ గీతంగా పార్లమెంట్ ఆమోదించి, రాష్ట్రపతి అనుమతి పొందిన అధికారిక ఉత్తర్వులు వెలువడిన ఈ రోజే, భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సభ జరగడం చాలా గర్వకారణంగా ఉందన్నారు.
భారతదేశం పరాయి పాలనలో ఉన్నప్పుడు, భాషా భేదాలకు అతీతంగా ప్రజలందరినీ దేశభక్తితో ఏకం చేసిన గొప్ప గీతం 'వందేమాతరం' అని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన 'నషా ముక్త్ భారత్' స్ఫూర్తితో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
జెన్-జీ (Gen-Z) యువత తమ పూర్తి శక్తి సామర్థ్యాలను సరైన మార్గంలో వినియోగించుకుంటూ, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ దేశ భవిష్యత్తు కోసం బాధ్యతాయుతంగా ఎదగాలని పిలుపునిచ్చారు.తన నియోజకవర్గంలోని విద్యార్థులు, యువత కోసం క్రికెట్, వాలీబాల్, షటిల్ వంటి క్రీడా ప్రాంగణాలు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, రాబోయే రెండు నెలల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్‌లోనూ ఇవి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వినోద్ వర్మ, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీ సెక్రటరీ నిశాంత్ వర్మ, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్,దిలీప్ చక్రవర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.




