Rampachodavaram: రంపచోడవరంలో ఉచిత వైద్య శిబిరం.. 150 మందికి సేవలు!
Rampachodavaram: సిరిగిందలపాడులో రామకృష్ణ మిషన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. 150 మంది గిరిజనులకు వైద్య పరీక్షలు, ఉచిత మందులు, అన్నదానం.
Rampachodavaram: రంపచోడవరంలో ఉచిత వైద్య శిబిరం.. 150 మందికి సేవలు!
రంపచోడవరం: రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమండ్రీ వారి అధ్వర్యంలో రంపచోడవరం, సిరిగిందలపాడు లో ఆదివారం వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలియచేసినారు.
ఈ ప్రత్యేక వైద్య శిభిరం లో సుమారు 150 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తేలియచేసినారు ఈ వైద్య శిభిరం లో డాక్టర్ పోతుల రామారావు ( గుండె వ్యాధుల వైద్యనిపుణులు ) డాక్టర్ శ్రీనివాస్ రాయుడు , డాక్టర్ దాసరి ఉమా మహేష్ , డాక్టర్ పావని ప్రియ సుమారు 150 మందికి వైద్య సేవలు. అందించారు.
ఈ వైద్య శిభిరం లో పాల్గొన్నరోగులకు 60 మందికి రక్తపరీక్షలు, 8 మందికి కి థైరాయిడ్ పరీ క్షలు , , 4 కీ ECGS , 20 మందికి physiotherapy చేసినట్లు స్వామీజి తెలిపినారు రోగులకు, సహాయకులు కు అన్నదానం నిర్వహించినట్లు స్వామీజీ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి రక్త పోటు (బి.పి ) మధుమేహం (షుగర్ ) , థైరాయిడ్ వ్యాధులు పై అవగాహన కలిగించారు.
ఆలాగే వర్షాకాలం లో వచ్చే వ్యాధులు గురించి, తీసుకోవలసిన జాగ్రాత్తలను చక్కగా వివరించారు రామక్రిష్ణ మిషన్ సిబ్బంది , వైద్యసేవల సమన్వయ కర్త కానుమోను శ్రీనివాస్ ,మాజీ జడ్పీటీసీ యర్రా వెంకట రామకృష్ణ (బాలాజీ శ్రీను) వాలంటీర్ చిన్నం ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.




