Tanuku: సంక్షోభంలో ఆక్వా రంగం.. జగన్ సదస్సును విజయవంతం చేయండి వైకాపా!

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వేదికగా వైకాపా జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 12 July 2026 12:03 AM IST
Tanuku
X

Tanuku: సంక్షోభంలో ఆక్వా రంగం.. జగన్ సదస్సును విజయవంతం చేయండి వైకాపా!

తణుకు: సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులకు మద్దతుగా ఈ నెల 15న భీమవరంలో నిర్వహించనున్న సంఘీభావ సదస్సునకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని వైకాపా జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే ఆక్వా పరిశ్రమను కూటమి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల నడ్డి విరిచే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఆక్వా ఫీడ్ తయారు చేసే కంపెనీలు, ఎక్స్పోర్టర్స్ వారి అనుయాయిలు కావడంతో ప్రభుత్వ పెద్దలు వారు చెప్పిందే వింటున్నారు తప్ప రైతులు చెప్పింది పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రూ. 1.50 పైసలకే విద్యుత్ సబ్సిడీ ఇచ్చి ఆక్వా రైతంగాన్ని ఆదుకొందని గుర్తు చేశారు.

క్రాప్ హాలిడే దిశగా ఆక్వా రైతులు.సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులు నేడు క్రాఫ్ హాలిడే ప్రకటించే దిశగా రోడ్లపై పయనిస్తుంటే ఒక్క ప్రజా ప్రతినిధి కూడా వారి సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. దీంతో ఆక్వా రైతులు తమ నాయకుడు వద్దకు వెళ్లి సమస్య ను విన్నవిస్తే వారికి మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భీమవరంలో ఆక్వా రైతుల చేపట్టిన సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు.

అక్రమ కేసులకు భయపడేదే లేదు.

ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా పార్టీలో చురుకుగా పనిచేస్తూ, అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుటుంబం పై ఏ విధంగా అక్రమ కేసులు బనాయించారానేది అందరికీ తెలుసన్నారు. ఇది ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నా సోషల్ మీడియా, యూట్యూబర్స్ పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వీటికి భయపడేది లేదని సవాల్ చేశారు.

కార్యక్రమంలో పార్టీ నాయకులు మురళీకృష్ణ రాజు, కొట్టు నాగు, సండ్ర వీరన్న, మారిశెట్టి శేషగిరి, వెలగల సాయిబాబా రెడ్డి, చోడే గోపికృష్ణ, షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story