Velerupadu: ఏలూరు వేలేరుపాడులో వరద సహాయక చర్యలపై మాక్ డ్రిల్
Velerupadu: గోదావరి రేవు వద్ద ఎస్డిఆర్ఎఫ్ బృందం మాక్ డ్రిల్. వరదల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేలా రెస్క్యూ ఆపరేషన్లపై పోలీస్, రెవెన్యూ శాఖలతో సమన్వయం.
Velerupadu: ఏలూరు వేలేరుపాడులో వరద సహాయక చర్యలపై మాక్ డ్రిల్
వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలోని రుద్రంకోట గోదావరి రేవు వద్ద ఎస్డిఆర్ఎఫ్ బృందం మాక్ డ్రీల్ నిర్వహించింది. ప్రకృతి వైపరీత్యాల చర్యల్లో భాగంగా వరదల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కాకినాడ నుంచి వచ్చిన ఎస్డిఆర్ఎఫ్ బృందం సభ్యులు 20 మంది మాకు డ్రిల్ లో పాల్గొన్నారు. గోదావరి నదిలో ఎవరైనా గల్లంతు అయితే, ఎలా రక్షించాలనేది, గోదావరిలో బోటు తిరగబడి సహాయం కోసం ఎదురుచూస్తున్న పలువురుని ఎలా రక్షించాలనే అంశంపై ప్రత్యేకంగా డ్రిల్ నిర్వహించారు.
అనంతరం ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది మాట్లాడుతూ.. వాటర్ రెస్క్యూ మార్క్ ఎక్సర్సైజ్ అనేది వరదల సమయంలో రిజర్వాయర్ లో నీరు వదిలినప్పుడు గోదావరి నదిలోకి వరద నీరు ఎక్కువగా చేరినప్పుడు గోదావరి నదిలో ఎవరైనా ప్రజలు చిక్కుకున్నప్పుడు వారిని సురక్షితంగా బయటకు ఎలా తీసుకురావాలనే ప్రక్రియ ఎలా చేయాలి. అన్ని శాఖలతో సమన్వయంగా మనం ప్రాసెస్ ఎట్లా చేయాలనేది. పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది మరియు మెడికల్ శాఖ తరపున పీహెచ్సీ వైద్యులు మరియు సిబ్బంది వచ్చినారు.
108 అంబులెన్సు సర్వీస్ను ప్రమాద సమయంలో ఎలా ఉపయోగించుకోవాలి. అలానే గోదావరి నదిలో చిక్కుకున్న ప్రజలను ఒత్తిడికి గురికాకుండా ఎలాంటి పరికరాల ద్వారా ఎలా సురక్షితంగా రక్షించాలనే అంశాలపై మాక్ డ్రీల్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవిన్యూ, ఎస్డిఆర్ఎఫ్ బృందం, మెడికల్, ఫైర్ సిబ్బంది, కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




