Veeravasaram: అండలూరు జడ్పీ హైస్కూల్ పక్కనే మురుగు కుంట!

Veeravasaram: వీరవాసరం మండలం అండలూరు జడ్పీ హైస్కూల్ వద్ద నిలిచిన మురుగునీరు దోమల బెడదతో విద్యార్థుల అవస్థలు, డెంగ్యూ భయం తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 29 Sept 2026 7:40 PM IST
Veeravasaram
X

Veeravasaram: అండలూరు జడ్పీ హైస్కూల్ పక్కనే మురుగు కుంట!

​వీరవాసరం: పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం అండలూరు గ్రామంలో పారిశుధ్య లోపం తీవ్రరూపం దాల్చింది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆనుకుని భారీగా మురుగు నీరు నిలిచిపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​పాఠశాల పక్కనే మురుగు నీరు కుంటలా మారి దుర్గంధం వెదజల్లుతోంది. దీనివల్ల దోమలు వ్యాపించి పాఠశాలలో చదివే విద్యార్థులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

​అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మురుగు నీటిని తొలగించి, పారిశుధ్య చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM