Penugonda: గుర్తింపు లేని ప్రైవేట్ స్కూల్స్ రద్దు చేయాలి

Penugonda: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నడుపుతున్న ప్రైవేట్ స్కూళ్లను సీజ్ చేయాలని డిమాండ్.

E.ABRAHAM, ACHANTA
Published on: 15 Jun 2026 9:39 PM IST
Penugonda
X

Penugonda: గుర్తింపు లేని ప్రైవేట్ స్కూల్స్ రద్దు చేయాలి

Penugonda: ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు లేకుండా ప్రైవేట్ స్కూల్స్లో ఎల్కేజీ యూ.కే.జీ విద్యార్థులను చేర్చుకుని నడుపుతున్న స్కూల్స్ ను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఎం.ఈ.ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎం.ఈ.ఓ రామకృష్ణకు వినతి పత్రం అందించారు. ఎస్ఎఫ్ఐ పెనుగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ,

కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కె ఈశ్వర్ మాట్లాడుతూ ఇప్పటికే క్లాసులను నడుపుతున్న అనుమతి లేని స్కూళ్లుకు నోటీసులో ఇచ్చామని పత్రికా ముఖంగా ఎంఈఓ సుభాకర్ తెలిపారని అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు

నోటీసులు ఇచ్చిన తర్వాత ఎన్ని స్కూళ్లను తనిఖీలు చేశారో,ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులతో నడుస్తున్న స్కూళ్లను ఎన్నింటిని సీజ్ చేశారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయా స్కూళ్లలో విద్యార్థులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ ఫ్రీ స్కూల్స్లో చేర్పించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని కోరారు.

అంగన్వాడీల లో విద్యార్థుల ఎదుగుదలకు పోషకాహారం అందించడంతో పాటు మనోవికాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున అధికారులు బాధ్యతలు తీసుకోవాలని కోరారు. సిఐటియు నాయకులు ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్స్ నిర్వహణపై అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి విద్యాశాఖ అధికారులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడి వర్కర్స్ సంఘీభావం తెలియచేశారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story