Bhimavaram: ఎస్‌ఎఫ్‌ఐ నిరసన దీక్ష.. ఎన్‌టీఏను రద్దు చేయాలని డిమాండ్!
Bhimavaram: కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఎన్‌టీఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భీమవరం ప్రకాశం చౌక్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.
Bhimavaram: ఎస్‌ఎఫ్‌ఐ నిరసన దీక్ష.. ఎన్‌టీఏను రద్దు చేయాలని డిమాండ్!
భీమవరం: డిల్లీ లో జరిగిన విద్యార్థి పోరాట స్పూర్తితో కేంద్రం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల పై పోరాటాలు సాగిద్దామని డిల్లీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పై వేధింపులు ఆపాలని,NTA ను రద్దు చేయాలని పటిష్ట విద్యా వ్యవస్థ తీసుకురావాలని లేకుంటే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని SFI కార్యదర్శి టి. ప్రసాద్ . బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్త పిలుపు లో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్ వద్ద SFIఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్య పూర్తిగా భ్రష్టు పట్టిందని అన్నారు.అందుకు ఉదాహరణనే నీట్ పరీక్షా విధానం అన్నారు.బీజేపీ ప్రభుత్వం లో ఇప్పటికే నీట్ పేపర్ అనేక సార్లు అయ్యిందని అన్నారు.NTA పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.
ఈ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ కడుపుమంది డిల్లీ లో పోరాటం సాగించి కేంద్రం మెడలు వంచి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు.NTA బీజేపీ జేబు సంస్థగా తయారయ్యింది అన్నారు. పేదవాడి కలలను ఛిద్రం చేస్తుందని అన్నారు.డిల్లీ పోరాటంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు చేస్తూ భయబ్రాంతులకు గురి చేసే విధంగా వేధింపులకు పాల్పడుతున్నదని ఈ చర్యని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నామని అన్నారు.
ఇప్పటికే కేంద్రానికి చెంపపెట్టులగా డిల్లీ ఉద్యమం జరిగిందని మళ్ళీ ఇప్పుడు వేధింపులకు గురి చేస్తే పతనం తప్పదని హెచ్చరించారు.ఇప్పటికైన కేంద్రం విద్యార్థుల పై వేధింపులు ఆపాలని NTA రద్దు చేసి పటిష్ట విద్యా వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని డిల్లీ ఉద్యమ స్పూర్తితో మరో పోరాటం తప్పదని అన్నారు.
కార్యక్రమంలో SFI నాయకులు పి. నాగేంద్ర, బి. సింధు, పి. సాయి కృష్ణ, టి. రేష్మ, కె. రోహిత్, జి.కౌశిక్, పి త్రినాథ్ ఎం స్పందన, ఎం.గౌతమ్, బి. దుర్గేష్, ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ, అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కోణాల జోసెఫ్ తమ సంఘీభావాన్ని తెలియజేసి విద్యార్థి పోరాటాలకు ప్రజలు ప్రజాసంఘాలు నిరంతరం అండగా ఉంటాయని తెలియజేశారు.




