Penumantra: పెనుమంట్రలో అగ్ని ప్రమాదం: తాటాకిల్లు దగ్ధం, రూ.50 వేల నగదు భస్మం!
Penumantra: పెనుమంట్రలో వర్షం కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి తాటాకిల్లు దగ్ధమైంది. ఇంట్లోని రూ.50 వేల నగదు, సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.
Penumantra: పెనుమంట్రలో అగ్ని ప్రమాదం: తాటాకిల్లు దగ్ధం, రూ.50 వేల నగదు భస్మం!
పెనుమంట్ర: ఆదివారం ఉదయం 10 గంటలకు అధిక వర్షం వలన కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి తాటి మహంకాళి ( లేటు) చిన్న ఉప్పరి అనే వ్యక్తి తాటాకు ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికి ఆహుతి అయింది వెంటనే స్పందించిన స్థానికులు మహిళలు, పురుషులు. ప్రక్కన ఉన్న బోధిలో నుండి, నీళ్లతో మంటలను అదుపులోకి తీసుకున్నారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మిగిలిన మంటలను అదుపులోకి తెచ్చారు. స్పందించిన నత్త రామేశ్వరం వీఆర్వో వీఆర్ఏ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి సంబంధిత మండల తహసిల్దార్ టి.రాజేశ్వరి
తెలిపరిచారు ఈ అగ్ని ప్రమాదంలో ఇటువంటి ప్రాణనష్టం జరగలేదు. తన కుమార్తె లక్ష్మి ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తూ తన అప్పుల నిమిత్తం తీర్చుకోవడానికి కూడా పెట్టుకున్న యాభై వేల రూపాయలు మంచం బట్టలు వంట సామ్రాగ్రి అగ్నికి ఆహుతి అయిపోయాయి, వీఆర్వో పంచనామా చేసి సంబంధిత అధికారులకు తెలియపరిచారు. వినాయక చవితి రోజులలో ఇలా జరగడం కుటుంబానికి తీరని లోటు.. ప్రభుత్వం వారు స్పందించి తగు సహాయం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.




