Tanuku: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు తణుకు విద్యార్థినులు ఎంపిక!

Tanuku: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల విద్యార్థినులు కే తేజ, టీ వెన్నెల.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 20 Aug 2026 6:43 AM IST
Tanuku
X

Tanuku: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు తణుకు విద్యార్థినులు ఎంపిక!

Tanuku: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు తణుకు ఎస్కే ఎస్డి మహిళా కళాశాల విద్యార్థినులు కే తేజ, టీ వెన్నెల ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు.

అమరావతి ఛాంపియన్షిప్-2026 లో భాగంగా ఈనెల 13న దేవరపల్లి మండలం దుద్దుకూరు శ్రీ రంగరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అండర్-17 జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ నెల 24 నుంచి 27 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన తేజ, వెన్నెల లను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అభినందించారు

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story