Tanuku: విద్యా, సేవా రంగాలకు తీరని లోటు అడ్డాల సత్యనారాయణ మృతి!
Tanuku: ఎస్‌ఎన్‌వీటీ జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు అడ్డాల నాగ సూర్య సత్యనారాయణ మృతి
Tanuku: విద్యా, సేవా రంగాలకు తీరని లోటు అడ్డాల సత్యనారాయణ మృతి!
తణుకు: ఎస్‌ఎన్‌వీటీ జూనియర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్,,సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు అడ్డాల నాగ సూర్య సత్యనారాయణ (ఎఎన్ఎస్) మృతి విద్యా,సామాజిక సేవా రంగాలకు తీరని లోటని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పేర్కొన్నారు.
తణుకు బ్యాంకు కాలనీలోని ఆదివారం ఎఎన్ఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా ఎఎన్ఎస్ క్రమశిక్షణ,నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహించి ఎందరో అధ్యాపకులకు,విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా విశ్రాంతి తీసుకోకుండా సమాజ సేవనే ధ్యేయంగా చేసుకుని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా వృద్ధుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారని తెలిపారు.
వయోభారంతో,అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుల ఇళ్ల వద్దకే వైద్యులను తీసుకెళ్లి వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషించారని,వైద్య శిబిరాలు నిర్వహించడం, జనరిక్ ఔషధ కేంద్రాలను నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా అనేక మందికి చేయూతనందించారని పేర్కొన్నారు.సమాజం పట్ల ఆయన చూపిన సేవాభావం,నిబద్ధత చిరస్మరణీయమన్నారు.




